వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినట్లే ఇచ్చి నిధుల్ని ఉపసంహరించుకుంటే ప్రశ్నించని జగన్‌కు ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు టిడిపి అధికార ప్రతినిధి యామిని. శనివారం ఆమె మీడియాలో మాట్లాడుతూ. వైకాపా అధినేత వైఎస్ జగన్ కేంద్రంపై పోరాడిన ఓ సందర్భం చూపండని నిలదీసారామె. . ఎన్నికల ముందే ప్రజా సమస్యలు తెలిశాయంటూ జగన్ చెప్పుకుంటున్నారని, రాష్ట్రంలో ఇల్లు కట్టుకున్నామనుకుంటే చాలదు... ఇక్కడ ఉండటానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడే పోలీసులను మాత్రం నమ్మని ఆయనకి ఈ రాష్ట్ర సిఎం కుర్చీ కావాలని కలలు కంటున్నారని, ఇందుకు పక్కరాష్ట్ర సిఎంతో కుయుక్తులు చేస్తున్నారని వ్యాఖ్యానించారామె. మోదీ, కేసీఆర్‌కు జగన్ తొత్తుగా మారారని , కేంద్రం . కేంద్రాన్ని ప్రశ్నించలేని జగన్‌కి రాజధాని ప్రజలు ఓట్లు వేయకూడదని అనుకున్నారని, తాజా పరిణామాలు, కేసలు అవిఫడవిట్లే చూసి . రాష్ట్ర ప్రజలు జగన్‌కు ఓటు వేయకూడదని మైండ్‌లో ఫిక్స్ అయిపోయారని చెప్పారు. జగన్‌కి బందువు సినీనటుడు మోహన్ బాబు విద్యాదానం మహాదానం అంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడం మినహా విద్యను అమ్ముకోవటంలో ఆయనే ఏరకమో తిరుపతి ప్రజలను అడిగితే చాలని, తెలుగు మహిళలకిచ్చే పసుపు- కుంకుమ పథకాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలుచేయటం ఆయన విజ్ఞత ఏపాటిదో అర్ధమవుతోందని మండిపడ్డారు యామిని
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa