టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 18న శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు కల్యాణవేదిక వద్ద అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల పనులను జెఈవో బి.లక్ష్మీకాంతంతో కలిసి శనివారం ఈవో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయంలో శిల్ప సౌందర్యాన్ని భక్తులు దర్శించుకునేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ధ్వజస్తంభం మరింత కాంతివంతంగా కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయం, కల్యాణవేదిక వద్ద స్తంభాలు కనిపించకుండా ఆకర్షణీయంగా అలంకరణ చేయాలని సూచించారు. ఆలయంలో వైర్లు బయటకు కనిపించకుండా వైరింగ్ చేయాలన్నారు. ఆలయానికి, పుష్కరిణికి మధ్యగల స్థలాన్ని చదును చేసి ఆకట్టుకునేలా ఉద్యానవనం పెంచాలని ఆదేశించారు. రథమండపం, పుష్కరిణి మధ్యగల ప్రహరీని తొలగించాలన్నారు. పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులు కల్యాణాన్ని తిలకించేలా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని సూచించారు.
బ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa