సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు వేయుటకు అనుగుణంగా ఇ.వి.ఎం, వివిప్యాట్ లపై అవాగహన కల్పించడం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర బాబు అన్నారు. ఆది వారం ఉదయం 9 గంటల నుండి సూర్యా మహల్ జంక్షన్ నుండి పెద్ద ఎత్తున మాబ్ డ్యాన్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. శని వారం ఒక ప్రకటనను విడుదల చేస్తూ జిల్లాలో పెద్ద ఎత్తున పోలింగు కేంద్రాలను సిద్ధం చేసామని అన్నారు. అర్హత కలిగిన అందరూ ఓటర్లుగా చేరుటకు తగిన అవగాహన కలిగించామని అన్నారు. మూడు నెలల కాలంలో దాదాపు లక్ష మంది ఓటర్లు చేరుట జరిగిందని అందులో యువత ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఓటర్లుగా చేరుటకు ఇప్పటి వరకు పలు కార్యక్రమాలను చేపట్టామని ఆయన పేర్కొంటూ పోలింగు తేదీ దగ్గర పడుతుందని అందుగు అనుగుణంగా ఎలక్ట్రానిక్ ఓటింగు మెషిన్ (ఇ.వి.ఎం), వివి ప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ ప్రింటు ఆడిట్ ట్రయల్) మిషన్ ల పనితీరుపై అవగాహన కలగించుటకు చర్యలు చేపట్టామన్నారు. ఇ.వి.ఎంలలో ఏ విధంగా ఓటు వేయాలి, తను వేసిన ఓటు అదే అభ్యర్ధికి పడిందా లేదా అనేది పరిశీలించ వచ్చని చెప్పారు. ఇ.వి.ఎంలు, వివిప్యాట్ లు అత్యంత సాంకేతిక భద్రత కలిగి ఉన్నవని ఆయన చెప్పారు. ఆది వారం ఉదయం నిర్వహించే మాబ్ డ్యాన్సులో యువత పెద్ద ఎత్తున తరలిరావాలని అందులో పాల్గొంటూ ఇవిఎంలపై అవగాహన పొందాలని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa