పేపర్, ఛానల్ ఉన్నాయి కదా అని పిచ్చిరాతలు రాసి..నోటికోచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తానని జగన్ కు జనసేన అధినేత పవన్ హెచ్చరికలు జారీచేశారు. ఆదివారం ఆయన కృష్ణా జిల్లా కైకలూరులో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ..రాయలసీయను రక్త చరిత్రగా మార్చిన చరిత్ర మీదికాదా అని నిలదీసారు. జగన్ తీరును ఆయన ఎండగట్టారు. పులివెందుల వేషాలు తన దగ్గర వేస్తే ఊరుకునేది లేదని..నోటికి వచ్చినట్టు విజయసాయి మాట్లాడితే తాట తీస్తానన్నారు. పాతకోటలు బద్దలుకొట్టి కొత్త రాజకీయాలు తీసుకొచ్చేందుకే తను రాజకీయాలలోకి వచ్చానని, జగన్, చంద్రబాబులు చేసే రాజకీయాలు తాను చేయలేనా..? అని ప్రశ్నించారు. . కేసీఆర్ అనుమతితోనే వైసీపీ బీ-ఫారాలు అందజేస్తోందని పవన్ విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa