భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. సముద్ర గస్తీ, అన్వేషణ, సహాయ కార్యక్రమాలకు ఉపయోగించేలా రూపొందించిన తొలి యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్‌డబ్ల్యు-ఏఎస్‌డబ్ల్యు) ఐఎన్‌ఎస్ ‘అర్నాల’ బుధవారం జలప్రవేశం చేయనుంది. విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అధ్యక్షత వహిస్తుండగా, తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ నౌకను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ డిజైన్ చేసి తయారు చేసింది. పీపీపీలో భాగంగా ఎల్ అండ్ టీ షిప్ బిల్డర్స్ దీనికి సహకారం అందించింది. ఈ తరహా నౌకలు మొత్తం 16 తయారు చేయాలని నేవీ నిర్ణయించింది. అందులో అర్నాల మొదటిది. మహారాష్ట్రలోని చారిత్రాత్మక అర్నాల కోటకు గుర్తుగా దీనికి ఈ పేరు పెట్టారు. గత నెల 8న దీన్ని నేవీ చేతికి అందించగా.. విశాఖలో బుధవారం జలప్రవేశం చేయిస్తున్నారు. అర్నాల 77.6 మీటర్ల పొడవు, 1,490 టన్నుల బరువు ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa