ఇరాన్ రాజధాని తేహ్రాన్‌పై బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడింది. అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ "హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్" సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు 585 మంది మరణించగా, 1,326 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 239 మంది పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కానీ, ఇరాన్ తాజాగా ప్రకటించిన గణాంకాల్లో 224 మంది మృతి చెందారని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa