మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన పర్యటన సమయంలో జరిగిన ఒక దుర్ఘటనలో కార్యకర్త మరణించిన సంఘటనపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. తనకు Z+ భద్రత ఉన్నప్పటికీ, తగిన రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపారు. వాహనం చుట్టూ రోప్ వేసి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అయినప్పటికీ ఈ ఘటన జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనను రాజకీయంగా వక్రీకరిస్తూ డైవర్షన్ సృష్టించే ప్రయత్నం జరుగుతోందని జగన్ విమర్శించారు. కార్యకర్త మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటనకు రాజకీయ రంగు పులమాలనవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడమే ఈ దుర్ఘటనకు కారణమని ఆయన ఆరోపించారు.
మరణించిన కార్యకర్త కుటుంబానికి సానుభూతి తెలిపిన జగన్, వారికి ఆర్థిక సహాయంగా రూ. 10 లక్షలు అందజేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యకర్తల భద్రతను నిర్లక్ష్యం చేయడం రాజకీయ దురుద్దేశంగా భావిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని జగన్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa