ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ అలముకున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసినప్పటికీ, ఆ దేశం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఎక్కడున్నాయో తమకు తెలియదని అమెరికా ఉన్నతాధికారులు అంగీకరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాడులకు ముందే ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, సుమారు 400 కిలోగ్రాముల అత్యంత శుద్ధి చేసిన యురేనియంను సురక్షిత ప్రాంతాలకు తరలించిందన్న వార్తలు ఈ ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అణు వివాదం ముదురుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్, ఇరాన్ అణు ముప్పును నిర్వీర్యం చేశామని ప్రకటించారు. 20న అమెరికా దళాలు, ఇజ్రాయెల్ నిఘా వర్గాల సహకారంతో, ఇరాన్‌లోని ఫోర్డో, నతాన్జ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడులతో ఇరాన్ అణు సామర్థ్యం ‘పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని’ ట్రంప్ తన మద్దతుదారులకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa