భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో తన ఇద్దరి పిల్లలతో సహా ఆమె బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మరణించారు. బావిలో మెట్లు పట్టుకుని కుమార్తె ఉంది. దీంతో స్థానికులు వెంటనే బాలికను రక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు.అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని తమ దర్యాప్తులో తెలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే ఆమె విసిగిపోయి.. ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిందని పోలీసులు వివరించారు. ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పేరిట నగదును ఖాతాలో వేసింది. ఈ ఖాతాలోని నగదును తన ఖాతాలోకి మళ్లించాలంటూ భార్యపై భర్త తీవ్ర ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో ఏర్పాటైన వివాదం వలన ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa