ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లోని ఒక ఫంక్షన్ హాలులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన నిన్న రాత్రి 8.47 గంటల ప్రాంతంలో జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక, పోలీసు శాఖ అధికారులు చేరుకున్నారు. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa