ఏపీఎండీసీ ఖనిజ సంపదతో పాటు రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టి తాజాగా రూ.5,500 కోట్లు బాండ్ల రూపంలో రుణాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...... ఈ రుణాల సేకరణలో ఏకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 203, 204, 293/1లను ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారాలను ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. న్యాయస్థానాల్లో దీనిపై వ్యాజ్యం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం బరితెగించి తప్పుడు విధానాలకు సిద్దమైందని ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa