భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి సాగనంపి ఫాల్కన్ 9 రాకెట్ భూమికి తిరిగి చేరుకుంది. ప్రయోగం మొదలైన 8 నిమిషాల్లోనే డ్రాగన్ క్యాప్సూల్ ను అంతరిక్షంలో వదిలి తిరిగి వచ్చింది. శుక్లాతో పాటు నలుగురు వ్యోమగాములు ఉన్న డ్రాగన్ క్రూ క్యాప్సూల్ నిర్ణీత సమయానికి ఫాల్కన్ 9 రాకెట్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్యాప్సూల్ దాదాపు 28 గంటల పాటు ప్రయాణించి రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ కు చేరుకుంటుంది. సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్ తో అనుసంధానమవుతుందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa