వైసీపీలో కీలక నియామకం జరిగింది. వైసీపీ అధినేత జగన్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబును గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్త (కోఆర్డినేటర్)గా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అంబటి రాంబాబు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన, 2024 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అంబటి రాంబాబు మొదటి నుంచి పార్టీకి బలమైన గొంతుకగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa