కోల్‌కతాలోని సౌత్ కలకత్తా లా కాలేజీలో జరిగిన సామూహిక అత్యాచార కేసులో పోలీసులు మరో కీలక అడుగు వేశారు. శనివారం ఈ కేసులో లా కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 25న సెక్యూరిటీ రూంలో జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.[]
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మోనోజిత్ మిశ్రా (31)తో పాటు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)లను గతంలోనే అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీ ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ ఐదు రోజుల కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa