భారత వెలుపల నిఘాలో కీలకమైన రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కొత్త చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌ను నియమించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ 'సిందూర్‌లో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఈ ఆపరేషన్‌కు తెరవెనుక ఇంటెలిజెన్స్ మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించారు. గగనతల ఉపగ్రహ ఫోటోలు విశ్లేషణ, డ్రోన్ మార్గ సూచనలు వంటి అంశాల్లో ఆయన దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుత RAW చీఫ్ రవీ సిన్హా జూన్ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. కొత్త చీఫ్ ఎంపిక చేపట్టారు. ప్రస్తుతం రా విభాగంలో సిన్హా తర్వాత అత్యంత సీనియర్ అధికారి జైన్ కావడంతో ఆయన్నే ఎంపిక చేశారని పేర్కొన్నాయి. పరాగ్ జైన్ జులై 1 నుంచి రెండేళ్లపాటు రా చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం జైన్.. ‘రా’ గగనతల నిఘా, టెక్నికల్ ఇంటెలిజెన్స్ విభాగం ఏవియేషన్ రిసెర్చ్ సెంటర్ (ARC) ప్రధాన అధికారిగా ఉన్నారు.
1989 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన జైన్.. పంజాబ్‌లో ఖలీస్థాన్ ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో SSP, డిప్యూటీ ఐజీగా సేవలందించారు. అలాగే, RAWలో పాకిస్థాన్ డెస్క్, జమ్మూ కశ్మీర్ విభాగం, శ్రీలంక, కెనడాలో ఇండియన్ మిషన్లలోనూ సేవలందించారు. ప్రత్యేకించి ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కశ్మీర్‌లోనూ, కెనడాలో ఖలిస్థాన్ మాడ్యూల్స్ పై నిఘాలో కీలక పాత్ర పోషించారు.
రా చీఫ్‌గా పరాగ్ జైన్ బాధ్యతలు చేపట్టడం దేశ బాహ్య భద్రత వ్యవస్థకు ప్రభావవంతమైన నిఘా ఆధారిత చర్యలే కాకుండా.. సాంకేతిక నిఘా, ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి వ్యవస్థలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియామకం దేశ భద్రతకు సంబంధించి ఎంతో కీలకం. ప్రత్యేకించి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రశిబిరాల పునర్నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, పరాగ్ జైన్ నాయకత్వంలోని ‘రా’ తక్షణమే ప్రతిస్పందించే సంసిద్ధతలో ఉంటుందన్నది స్పష్టం. దేశ భద్రతకు సంబంధించి శత్రుదేశాల కదలికలు, ఏజెంట్లు, వారి కుట్రలపై సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా కీలకం. ఈ విషయంలో రా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa