అహ్మదాబాద్‌లో జూన్ 1 జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమానయాన విపత్తులలో ఒకటిగా నిలిచింది. లండన్‌కు బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్‌లోని మెఘనినగర్ ప్రాంతంలో ఉన్న ఒక రెసిడెన్షియల్ కాలనీపై కూలిపోగా.. 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటన తర్వాత కూడా మానయాన భద్రతకు సంబంధించి పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ఇలాంటి ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. అడిస్ అబాబా నుంచి ముంబైకి వస్తున్న ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం ET640 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్) శుక్రవారం తెల్లవారుజామున 1.42 గంటలకు ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో డీప్రెషరైజేషన్ సమస్య తలెత్తడంతో పైలట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం అరేబియా సముద్రం మీదుగా వెళ్తున్నప్పుడు ఓ సమస్య తలెత్తింది. విమానం 33,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా క్యాబిన్‌లో డీప్రెషరైజేషన్ సమస్య (depressurisation) తలెత్తింది. దీంతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న మెడికల్ టీమ్.. ఏడుగురు ప్రయాణికులకు వైద్య సహాయం అందించారు. వారిలో ఒకరిని ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది.
ఇలాంటి ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. విమానాల్లో ప్రయాణికుల భద్రత గురించి ఎయిర్‌లైన్ సంస్థలు మరింత శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, జూన్ 23న ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. హీత్రో-ముంబై ముధ్య నడిచే బోయింగ్ 777 విమానంలో సమస్య ఏర్పడింది. దీని కారణంగా ఆరుగురు సిబ్బందితో సహా 11 మంది ప్రయాణికులకు తల తిరగడం, వికారం వంటి సమస్యలు వచ్చాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎందుకిలా జరిగింది అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏమిటీ డీప్రెషరైజేషన్?
విమానం ప్రయాణిస్తున్నప్పుడు క్యాబిన్‌లో ఒత్తిడి తగ్గడాన్ని డిప్రెషరైజేషన్ అంటారు. సాధారణంగా, క్యాబిన్ ఒత్తిడిని 8,000 అడుగుల ఎత్తులో సరిపోయేటట్లు సెట్ చేస్తారు. కానీ ఇది తగ్గినప్పుడు ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. దీనివల్ల ప్రయాణికులకు హైపోక్సియా (శరీర కణాలకు ఆక్సిజన్ అందకపోవడం) ఏర్పడుతుంది. చెవులు మూసుకుపోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, చేతులు, కాళ్లు జలదరించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విమాన ఎత్తు 14,000 అడుగులకు చేరగానే ఆటోమేటిక్‌గా ఆక్సిజన్ మాస్కులు బయటకు వస్తాయి. తక్షణమే ఆక్సిజన్ మాస్కులు ధరించకపోతే స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి సమయాల్లో పైలట్లు వెంటనే విమానాన్ని తక్కువ ఎత్తుకు (10,000 అడుగుల లోపు) దింపుతారు. ఈ ఆల్టిట్యూ్డ్‌లో కూడా ఈ సమస్య ఏర్పడితే అత్యవసర ల్యాండింగ్‌లకు దారితీస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa