ర్యాపిడో, ఉబర్, ఓలా లాంటి క్యాబ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలను ప్రకటించింది. దీనిలో రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీలపై 50% వరకు సర్జ్ ఛార్జీ విధించేందుకు అవకాశం కల్పించింది. రద్దీ అధికంగా ఉన్న సందర్భాల్లో ఇది 200% వరకు పెంచుకోవచ్చని తెలింపింది. అయితే, మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణాలపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa