తాడిపత్రిలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. వైయస్ఆర్‌సీపీ నాయకులను తన్ని తరిమేస్తే ఎవ్వర్రా మీకు దిక్కు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే పచ్చమూకలు ఈ దాడులకు దిగడం గమనార్హం. ముందుగా తాడిపత్రి మండలం చుక్కలూరు ఎంపీటీసీ సభ్యురాలు మేరీ ఇంటిపై దాడికి చేశారు. బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారు. ఇంటి ముందు ఉన్న రెండు బైకులు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంటిపై నిద్రిస్తున్న ఎంపీటీసీ భర్త భాస్కర్ ప్రాణ భయంతో కిందకు దూకడంతో కాలికి గాయమైంది. ఆయన్ను కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంభందించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa