నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం పుత్తూరు మండలం , పరమేశ్వర మంగళం నందు జరుగుతున్న మాతమ్మ తిరుణాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని మాతమ్మకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహా మంగళ హారతి అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa