నగిరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపాలిటీలోని 16, 17 వ వార్డులలో బుధవారం నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను మరియు పుత్తూరులో చేసిన అభివృద్ధి పనుల ను గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుత్తూరుకు వెళ్లిన ఎమ్మెల్యేకి మహిళలు కర్పూర హారతులు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa