ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, ఆ తరువాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేయడం వైయస్ జగన్ గుణమని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో గురువారం `బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ` కార్యక్రమం పెద్దిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి హాజరై `రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో` కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, నాయకులు భాస్కర్ రెడ్డి, పుంగనూరు ఎంపీపీ , అలీమ్, పుంగనూరు మున్సిపల్ చైర్మన్, రొంపిచర్ల ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, తదితరులు చంద్రబాబు రీ కాలింగ్ మానిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa