జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వినుతను ఆ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ మేరకు మీడియాకు జనసేన అధిష్టానం ఇవాళ(శనివారం) లేఖ విడుదల చేసింది. వినుత వ్యవహార శైలి జనసేన విధి విధానాలకి భిన్నంగా ఉండటంతో ఆమెని గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచినట్లు జనసేన హై కమాండ్ తెలిపింది. ఆమెపై చెన్నైలో జరిగిన ఓ హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయని గుర్తుచేసింది. ఈ క్రమంలో వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించామని జనసేన హై కమాండ్ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa