అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాథమిక నివేదిక ద్వారా ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించలేమని తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని అన్నారు. విమాన ప్రమాద బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇవాళ (శనివారం) విశాఖపట్నంలోని సాగర్ మాలా కన్వెన్షన్ సెంటర్‌లో రోజ్‌గార్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న 52 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బొహ్రా, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa