దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్దిగ్గజం శాంసంగ్నుండి కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ విడుదలైంది.శాంసంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ స్మార్ట్ఫోన్ భారత్లో లాంచ్ అయింది.
శాంసంగ్ తాజాగా భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. *Samsung Galaxy F36 5G* పేరుతో విడుదలైన ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో లభ్యమవుతుండటంతోపాటు, హై ఎండ్ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న Super AMOLED డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ OIS ప్రధాన కెమెరా, Exynos 1380 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్‌లో Google Circle to Search, AI NightShot, Edit Suggestions, Gemini Live వంటి ఆధునిక AI టూల్స్ కూడా ఉన్నాయి.Android 15 ఆధారంగా రూపొందించిన One UI 7 వర్షన్‌తో ఇది పనిచేస్తోంది. ఈ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర ₹17,499గా నిర్ణయించబడింది. ఇప్పటికే ఇది సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. అధునిక ఫీచర్లను తక్కువ ధరలో అందించడంతో ఈ ఫోన్ మధ్య తరగతి వినియోగదారులకు అనువైన ఎంపికగా నిలుస్తోంది.
*స్పెసిఫికేషన్లు : Galaxy F06 5G
6.7″ HD+ LCD డిస్ప్లే
MediaTek Dimensity (D6300), 50 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ
25W ఫాస్ట్ ఛార్జింగ్, 4 యాక్ట్ OS అప్‌గ్రేడ్‌లు, Knox Vault భద్రతతో మా4 సంవత్సర సెక్యూరిటీ సపోర్ట్ కలిగి ఉంది .
Galaxy F56 5G
F సిరీస్‌లో అత్యంత స్లిమ్ ఫోన్ (7.2 mm), 50 MP ట్రిపుల్ కెమెరా, Gorilla Glass Victus+ పరిరక్షణ
6 ఏళ్ల Android అప్‌డేట్ సపోర్ట్, AI ఎడిటింగ్ ఫీచర్లు
సుమారుగా ₹15,000–₹20,000 పరిధిలో మార్కెట్లో ప్రవేశించింది
Galaxy A56 5G / A36 5G
6.7″ Full HD+ Super AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
Exynos 1580 SoC, 6GB‑12GB RAM, 50 MP + 12 MP + 5 MP కెమెరాల వ్యవస్థ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000 mAh బ్యాటరీ
IP67 వాచ్‌రోబస్ట్ డిజైన్, Android 15, One UI 7, 4–6 ఏళ్ల OS సపోర్ట్ కలిగి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa