రక్తంలో షుగర్ లెవల్స్ మన శరీర శక్తికి చాలా ముఖ్యం. అయితే, ఇవి సరైన స్థాయిలో ఉండటం ఆరోగ్యానికి అత్యవసరం. రక్తంలో చక్కెర స్థాయిలు వయస్సు, రోజులో సమయం (భోజనానికి ముందు లేదా తర్వాత), వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి వంటి అనేక అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటాయి. వయసు ప్రకారం రక్తంలో షుగర్ లెవల్స్ ఎంత ఉండాలో తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్లడ్ షుగర్ లెవల్స్ ఛార్ట్‌పై ఓ లుక్కేయండి
ప్రతి వ్యక్తికి రక్తంలో చక్కెర స్థాయి ఒకేలా ఉండదు. శరీర అవసరాలు, శారీరక శ్రమ, వయస్సుతో పాటు మారుతూ ఉంటాయి. అందుకే వయస్సును బట్టి రక్తంలో చక్కెర స్థాయిలను అర్థం చేసుకోవడం, ట్రాక్ చేయడం ముఖ్యం. పిల్లలు, యువత, పెద్దలు, వృద్ధులలో జీవక్రియ భిన్నంగా ఉంటుంది. దీని కారణంగా, వారి చక్కెర స్థాయి సాధారణం కంటే కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. వయస్సును బట్టి రక్తంలో షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటే సకాలంలో ప్రమాదాన్ని గుర్తించవచ్చు.
టైప్ 1 డయాబెటిస్ పిల్లలలో కనిపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ పెద్దలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, ఇద్దరిలోనూ చక్కెర స్థాయి, లక్ష్యం భిన్నంగా ఉంటాయి. వయస్సును బట్టి రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవడం ముఖ్యం. మీరు మీ రక్తంలో చక్కెర స్థాయి గురించి తెలుసుకుంటే, సరైన చికిత్స, డైట్ ప్లాన్, వ్యాయామం ప్లాన్ చేసుకోవచ్చు. వయసు ప్రకారం రక్తంలో షుగర్ లెవల్స్ ఎంత ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
రక్తంలో షుగర్ లెవల్స్
రక్తంలో షుగర్ లెవల్స్ వయస్సును బట్టి మారుతూ ఉంటాయి. మనం పెద్దయ్యాక, జీవక్రియ రేటు తగ్గుతుంది. దీని కారణంగా శరీరంలో గ్లూకోజ్ విచ్ఛిన్న ప్రక్రియ నెమ్మదిస్తుంది. పెరుగుతున్న వయస్సుతో, ఇన్సులిన్ నిరోధకత కూడా పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదాన్ని పెంచుతుంది. అదే సమయంలో.. పిల్లలు, యువకులు వేగవంతమైన జీవక్రియను కలిగి ఉంటారు. దీంతో.. వారి శరీరం త్వరగా గ్లూకోజ్‌ను శక్తిగా మారుస్తుంది.
రక్తంలో షుగర్ లెవల్స్ ఎలా చెక్ చేస్తారు?
రక్తంలో చక్కెర స్థాయిలను అర్థం చేసుకోవడానికి ముందుగా ఫాస్టింగ్ షుగర్ లెవల్స్, భోజనం తర్వాత షుగర్ లెవల్స్, HbA1cని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఫాస్టింగ్ షుగర్ లెవల్స్ అంటే.. కనీసం 8 గంటల పాటు ఏమీ తినకుండా ఉన్న తర్వాత తీసుకునే రీడింగ్. అంటే రాత్రి భోజనం తర్వాత కనీసం 8 గంటల పాటు ఖాళీ కడుపు ఉంటే ఈ రీడింగ్స్ వస్తాయి. అందుకే పరగడపున ఉదయాన్నే ఈ రీడింగ్స్ తీసుకుంటారు. ఇక, భోజనం తర్వాత రక్తంలో షుగర్ లెవల్స్ అంటే భోజనం చేసిన 1-2 గంటల తర్వాత తీసుకునే రీడింగ్. ఈ లెక్కలు శరీరం చక్కెరను ఎలా నిర్వహిస్తుందో చెబుతుంది. HbA1c అంటే గత 2-3 నెలల రక్తంలో చక్కెర సగటును చెబుతుంది. చక్కెరను కొలిచే ఈ మూడు ప్రమాణాలను ఉపయోగించి రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేస్తారు.
ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?
డయాబెటిస్‌కు ముందు పరిస్థితి ప్రీడయాబెటిస్. మీ ఉపవాసం ఉన్న తర్వాత రక్తంలో చక్కెర 100 నుంచి 125 mg/dL మధ్య ఉంటే, అది ప్రీడయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. తిన్న తర్వాత HbA1c 140 నుంచి 199 mg/dL మధ్య ఉంటే ప్రీడయాబెటిస్ కూడా సంభవించవచ్చు. 5.7% కంటే ఎక్కువ HbA1c కూడా డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే, రక్తంలో చక్కెరను సులభంగా సాధారణంగా ఉంచుకోవచ్చు. ఈ వ్యాధి ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు.
వయసు
ఫాస్టింగ్ (తినకముందు) (mg/dl)
భోజనం తర్వాత(mg/dl)
HbA1c (mg/dl)
6 ఏళ్ల లోపు పిల్లలు
80-180
70 - 140
5.7% లోపు
పిల్లలు 6-12 ఏళ్లు
70-100
70 - 140
5.7% లోపు
13 - 19 ఏళ్లు
70 - 105
70 -145
5.7% లోపు
20 -49 ఏళ్లు
70-110
70-140
5.7% లోపు
41- 60 ఏళ్లు
70-115
70-150
5.7% లోపు
60 ఏళ్లపైన
70-120
70-160
5.7% లోపు
రక్తంలో షుగర్ లెవల్స్‌ను ప్రభావితం చేసే అంశాలు
రక్తంలో షుగర్ లెవల్స్‌ను ప్రభావితం చేసే అంశాలు
* ఆహారం: కార్బోహైడ్రేట్లు, చక్కెరలు అధికంగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయని నిపుణులు అంటున్నారు.
* శారీరక శ్రమ: వ్యాయామం రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో సాయపడుతుంది.
* మందులు: డయాబెటిస్ మందులు లేదా ఇన్సులిన్ వంటివి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. వేరే మందులు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
* ఒత్తిడి: ఒత్తిడి హార్మోన్లు అంటే కార్టిసాల్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవచ్చు.
* అనారోగ్యాలు: అనారోగ్యాలు శరీరానికి ఒత్తిడిని కలిగించి, రక్తంలో చక్కెరను పెంచుతాయి.
* నిద్ర: తగినంత నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
* డీహైడ్రేషన్: శరీరంలో నీటి శాతం తగ్గడం కూడా రక్తంలో గ్లూకోజ్ సాంద్రతను పెంచుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa