మస్కట్ నుండి ముంబైకు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గురువారం థాయిలాండ్‌కు చెందిన ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అత్యవసర సమయంలో విమానంలోని క్యాబిన్ సిబ్బంది, ప్రయాణిస్తున్న ఓ నర్సు కలిసి ప్రసవం చేశారు. పురిటి నొప్పులు ప్రారంభమైన వెంటనే వారు స్పందించి సురక్షితంగా ప్రసవం చేశారు. అనంతరం ముంబయిలో అత్యవసర ల్యాండింగ్ చేసి తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa