తెల్లబఠానీలు.. వీటిని నార్మల్‌గా తీసుకొచ్చి నానబెట్టి మనం ఏదో రకంగా వంటల్లో వాడతారు. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఇందులో కొవ్వులు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే ఆకలి కంట్రోల్ అవుతుంది. ఈ బఠానీలని తీసుకోవడం వల్ల గట్ మైక్రోబయోమ్ మెంటెయిన్ అవుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాకుండా, ఈ బఠానీలు తీసుకుంటే ఎన్నో సమస్యలు దూరమవుతాయి.
కొలెస్ట్రాల్ తగ్గేందుకు
తెల్లబఠానీలు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనికి కారణ బఠానీల్లోని ఫైబర్. ఇవి మీ బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. అంతేకాకుండా ఈ గింజల్లో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి వంటి విటమిన్స్, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి మీ బాడీలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి.
గ్లూకోజ్ లెవల్స్ తగ్గేందుకు
తెల్లబఠానీల్లో ప్రోటీన్స్, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో ఆక్సీకరణ, శోథ నిరోధక, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఇది మీ గ్లూకోజ్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి. మీరు మీ ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా చేస్తాయి. వీటిని తినడం వల్ల హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. షుగర్ ఉన్న వారికి ఇవి చాలా మంచివి. వీటి వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమయ్యే ప్రమాదం చాలా తక్కువ.
గుండె ఆరోగ్యానికి
తెల్లబఠానీల్లోని ఐసోఫ్లేవోన్, ఫ్లేవనాయిడ్స్ వంటి ఫినాలిక్ భాగాలు ఒత్తిడికి సంబంధించిన చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. అంతేకాకుండా గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆహారంలోని ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ని తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాకుండా గుండెకి మేలు చేస్తాయి.
అనీమియాకి చెక్
వీటన్నింటితో పాటు తెల్లబఠానీల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బాడీలో ఎర్రరక్తకణాల సాంద్రతని పెంచుతాయి. వీటి వల్ల రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. తెల్లబఠానీలు తీసుకుంటే బలహీనత, అలసట వంటి ఐరన్ లోపం వల్ల సమస్యల్ని తగ్గుతాయి. ఇందులో విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది. వీటి వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ని మెంటెయిన్ చేయొచ్చు.
మలబద్ధకం
ముందుగా చెప్పుకున్నట్లుగానే తెల్లబఠానీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు సరిగ్గా ఉంటాయి. పేగు బ్యాక్టీరియా కార్యకలాపాలకి కూడా చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే గట్ హెల్త్ సరిగా ఉంటుంది.
ఎలా తీసుకోవాలి
వీటిని నానబెట్టి ఉడికించి కూరలా చేయొచ్చు. ఈ కూర అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది.
ఉడికించిన బఠానీలను సలాడ్స్‌లో కలిపి తినొచ్చు.
వీటిని మెత్తగా చేసి చాట్‌లా తయారుచేసి తినొచ్చు.
బఠానీలని ఉడికించి స్నాక్‌లా కూడా తినొచ్చు.
ఇలా ఎలా తిన్నా మంచిదే. అయితే, పోర్షన్ కంట్రోల్ మాత్రం మరిచిపోవద్దు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa