పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారుల KYC (నో యువర్ కస్టమర్) వివరాల్ని.. 2025, ఆగస్ట్ 8 లోపు అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. ఖాతాదారులు తమ బ్యాంక్ అకౌంట్లు సజావుగా పనిచేయడానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేవైసీ అప్‌డేట్ జరుగుతోంది. ఖాతాదారులు వ్యక్తిగతంగా బ్రాంచ్‌ను సందర్శించడం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం లేదా రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా తమ పత్రాలను సమర్పించడం ద్వారా కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. కేవైసీని అప్‌డేట్ చేయడంలో విఫలమైతే, ఖాతా కార్యకలాపాలు నిలిపివేయబడవచ్చు. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలను నిరంతరాయంగా ఉపయోగించవచ్చు. ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది.
RBI వెబ్‌సైట్ ప్రకారం.. "KYC అంటే 'నో యువర్ కస్టమర్'. ఆర్థిక సంస్థలు తమ కస్టమర్ల గుర్తింపులను తనిఖీ చేసే పద్ధతిని ఇది సూచిస్తుంది. మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వంటి చట్టవిరుద్ధమైన చర్యలను నివారించడానికి కేవైసీ ఒక ముఖ్యమైన ప్రక్రియ, అదే సమయంలో సంస్థను, క్లయింట్‌ను రక్షిస్తుంది."
2025, జూన్ 30 నాటికి కేవైసీ అప్‌డేట్ పెండింగ్‌లో ఉన్న ఖాతాదారులకు.. ఆగస్టు 8, 2025 వరకు KYCని అప్‌డేట్ చేయడానికి గడువు తేదీ వర్తిస్తుంది. కేవైసీ నిబంధనల ప్రకారం, పీఎన్‌బీ వినియోగదారులు.. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, లేటెస్ట్ ఫొటో, PAN/ఫారం 60, ఇన్‌కం ప్రూఫ,, మొబైల్ నంబర్ (లేకపోతే) లేదా ఏదైనా ఇతర కేవైసీ సమాచారాన్ని అందించాలని కోరింది. గడువు తేదీలోగా సమాచారం అప్‌డేట్ చేయకపోతే, బ్యాంక్ ఖాతా కార్యకలాపాలు నిలిపివేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నెట్ బ్యాంకింగ్ సౌకర్యం, బ్యాంక్ ఖాతాల నుంచి ఉపసంహరణలు మొదలైన వాటికి కూడా యాక్సెస్ ఉండదు.
పీఎన్‌బీ కస్టమర్లు.. తమ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయడానికి చాలానే ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా అవసరమైన పత్రాలను వ్యక్తిగతంగా సమర్పించవచ్చు. అర్హత కలిగిన వినియోగదారులు PNB ONE లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ (IBS) ద్వారా ఆన్‌లైన్‌లో KYC అప్‌డేట్స్ పూర్తి చేయొచ్చు. వినియోగదారులు రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా వారి కేవైసీ డాక్యుమెంట్లను వారి బేస్ బ్రాంచ్‌కు పంపొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa