తిరుపతి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు నిర్వహించే శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లను ఇకపై ఆన్‌లైన్‌లో మాత్రమే జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారానే ఈ టికెట్ల విక్రయం జరుగుతుంది.ప్రస్తుతం భక్తులకు కరెంట్ బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే, భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1 నుంచి మొత్తం 200 టికెట్లను ఆన్‌లైన్ ద్వారానే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. కావున, భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ విశేష హోమంలో రూ.1600 చెల్లించి గృహస్థులు ఇద్దరు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న గృహస్థులకు రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa