ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ పనులు చేస్తే చాలు, కుండలా ఉన్న పొట్ట కూడా కరగాల్సిందే

Life style |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 11:33 PM

​బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు కొన్ని లైఫ్‌స్టైల్ చేంజెస్ చేస్తే చాలా వరకూ సమస్య తగ్గుతుంది. బెల్లీ తగ్గడానికి మంచి డైట్ ఫాలో అవ్వడంతో పాటు. వర్కౌట్ చేస్తూ మంచి లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా, కేలరీలను తగ్గించుకోవాలి. వర్కౌట్ చేయాలి. ఒత్తిడిని దూరం చేసుకోవాలి. మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ముఖ్యకారణాలలో అన్ హెల్దీ ఫుడ్ తినడం, వర్కౌట్ చేయకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్లే బెల్లీ పెరుగుతుంది. వర్కౌట్ చేయకపోయినా, మనం తీసుకున్న కేలరీలన్నీ బాడీలో పేరుకుపోతాయి. ముఖ్యంగా, బెల్లీ భాగలో.. దీని వల్లే బెల్లీ పెరగుతుంది. ఒత్తిడి ఉన్నా కూడా కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ని పెంచుతుంది. అలాంటి బెల్లీని సమస్య తగ్గేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.


ఉదయాన్నే హెల్దీ డ్రింక్, నీరు


చాలా మంది ఉదయాన్నే లేవగానే టీ, కాఫీలు తాగుతారు. అలా చేయడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి, టీ, కాఫీలు కాకుండా ఉదయాన్నే హెల్దీ డ్రింక్ తీసుకోవాలి. లేదంటే నీరు తాగాలి. దీని వల్ల తేలిగ్గా అనిపిస్తుంది. నీరు తాగితే బాడీ యాక్టివ్ అవుతుంది. మార్నింగ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అన్ హెల్దీ ఫుడ్స్ తినకుండా ఉంటారు. పైగా రాత్రంతా ఫుడ్, నీరు లేని బాడీకి నీరు తాగడం వల్ల హైడ్రేషన్ అందుతుంది.


రీసెట్


అదే విధంగా, ఉదయాన్నే లేచి అబ్బా లేట్ అయిందని హడావిడిగా పనులు మొదలుపెట్టకుండా కాస్తా ముందుగా నిద్రలేచి రెండంటే రెండు నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. ఆ తర్వాత రోజులో చేయాల్సిన పనులు ఏంటో అన్నీ ఆలోచించుకుని ప్లాన్ చేసుకోండి. దీంతో రోజులో ప్రాపర్‌గా ప్లాన్ అవుతుంది. మీ డే ప్రొడక్టివ్‌గా ఉంటుంది. ఏ పని తర్వాత ఏ పని చేయాలా అనేది ఓ క్లారిటీ ఉంటుంది. దీంతో ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా పనులు చేసుకోవచ్చు.


వర్కౌట్


వర్కౌట్ చేయడం కూడా ముఖ్యమే. దీనికోసం ఓ జిమ్ వర్కౌట్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ చేయొచ్చు. లేదంటే జిమ్‌కి వెళ్లి కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయొచ్చు. దీని వల్ల యాక్టివ్‌గా ఉంటారు. బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా బద్ధకంగా ఉండదు కూడా. మీకు వీలైనంత వర్కౌట్ చేయండి. వాకింగ్ వంటివి కూడా చేయడం మంచిది.


బ్రేక్‌ఫాస్ట్


బ్రేక్‌ఫాస్ట్ కూడా హెల్దీగా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. గుడ్లు, ఓట్స్, స్మూతీస్, పోషకాహారం కూడా తీసుకోవాలి. దీని వల్ల హెల్దీగా మీ డైట్‌ని స్టార్ట్ చేసిన వారవుతారు. దీనికోసం అప్పటికప్పుడు హడావిడిగా ప్రిపేర్ చేయకుండా ముందరోజే ఏ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి. డీటాక్స్ వాటర్ తీసుకుంటే హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో పగటిపూట ఎక్కువగా తినకుండా ఉంటారు.


ఎండలో ఉండడం


లేవగానే పనులన్నీ చేసుకుని కాసేపు ఎండలో ఉండండి. వర్షాకాలంలో ఎండ కష్టమే. కానీ, ఎండ ఉన్నప్పుడు కాసేపు బయటికి రండి. ఎండ కూడా ఇంట్లో పడేలా చూడండి. ఎండ వల్ల శరీరానికే కాదు. మానసికంగా కూడా బాగుంటుంది. పాజిటివిటీ పెరుగుతుంది. జీవక్రియ మెరుగ్గా మారుతుంది. ఈ టైమ్‌లో వీలైతే మెడిటేషన్ చేయండి. దీని వల్ల కూడా చాలా ప్రెజర్ తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa