AP: విజయవాడ-నెల్లూరు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న భారీ మొత్తంలో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ బ్యాగును పరిశీలించగా.. అందులో రూ.49.45 లక్షల నగదును గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాడేపల్లిగూడెనికి చెందిన మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa