AP: కూటమి ప్రభుత్వంపై తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఫైరయ్యారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారకనాథ్ మాట్లాడుతూ.. మిథున్ రెడ్డిని జైలులో టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్లు చూస్తున్నారని మండిపడ్డారు. ములాఖత్‌లో పోలీసులు పక్కనే ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa