ఇంధన ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్‌కి డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ నేపథ్యంలో TVS Sport 110 బైక్ వినియోగదారుల మనసు దోచుకుంది. ఈ బైక్ తన అధికమైన 85 కిలోమీటర్ల మైలేజ్‌తో మార్కెట్‌లో సంచలనంగా మారింది. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో ప్రయోజనం కలిగించే ఈ బైక్‌ను ప్రజలు కళ్లు మూసుకుని కొనుగోలు చేస్తున్నారు.TVS కంపెనీ ప్రకారం, Sport 110 బైక్ రోజువారీ వాడకానికి సరైనదిగా రూపొందించబడింది. ఇది అందుబాటు ధరలో లభించడంతో పాటు, మెరుగైన ఫ్యూయల్ ఎఫిషెన్సీని అందిస్తుంది. బైక్ ధర సుమారు ₹60,000–₹65,000 మధ్య ఉండగా, దాని మైలేజ్ 80-85 కిలోమీటర్ల మధ్యగా ఉంటుంది (ప్రయోగశాలలో మరియు వాస్తవిక రైడింగ్ కండిషన్స్ ఆధారంగా).ఇంత మైలేజ్, తగ్గ ధరకే లభించడంతో కస్టమర్లు పెద్ద ఎత్తున కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ సేల్స్‌లో 400% వృద్ధి సాధించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే భారీ రికార్డు. స్ప్లెండర్, ప్లాటినా వంటి మైలేజ్ బైక్స్‌కి గట్టి పోటీగా మారిన ఈ బైక్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగరాల్లోనూ ఏకకాలంలో సూపర్ హిట్ అయింది.ఇది 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది, అంటే ఒకసారి ఫుల్ చేసినట్లయితే నగర ప్రయాణాలు, డైలీ ఆఫీసు కమ్యూట్స్ అన్నీ చాలాసేపు టెన్షన్ లేకుండా పూర్తి చేయొచ్చు. ముఖ్యంగా ఈ బైక్ మైలేజ్ కింగ్. మార్కెట్లో ఉన్న యూజర్ల ఫీడ్‌బ్యాక్ ప్రకారం, ఇది సుమారు 70 నుండి 85 కి.మీ/లీటర్ వరకూ మైలేజ్ ఇస్తోంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో ఇది బెస్ట్..టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో సుదీర్ఘకాలంగా తన స్థానాన్ని నిలబెట్టుకున్న మోడల్. ప్రస్తుతం ఈ బైక్ రెండు వేరియంట్లలోడ్యూయల్ టోన్ డ్రమ్, డ్యూయల్ టోన్ డిస్క్ అందుబాటులో ఉంది. డ్యూయల్ టోన్ డ్రమ్ వేరియంట్ కొనుగోలుదారులకు నాలుగు రకాల ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లను అందిస్తోంది. వీటిలో నలుపు/నీలం, నలుపు/ఎరుపు, నలుపు/బూడిద, నీలం/సిల్వర్ ఉన్నాయి.మరోవైపు, డ్యూయల్ టోన్ డిస్క్ వేరియంట్ మూడు రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి నలుపు/ఎరుపు, నలుపు/బూడిద, నీలం/సిల్వర్ కలయికలు. ఈ కలర్ కాంబినేషన్లు మెట్రో యూజర్ల నుంచి రూరల్ యూజర్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయి. ఉద్యోగస్తులు, రోజువారి ప్రయాణాలకు మైలేజ్ పరంగా ఈ బైక్ బాగా సెట్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa