ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 15న తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు గల కారణాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు వివరించారు. తలపై పెద్ద లగేజీ మోస్తున్న ఓ వ్యక్తి కింద పడిపోవడంతోనే గందరగోళం జరిగి తొక్కిసలాటకు దారితీసిందన్నారు. యూపీలోని మహా కుంభమేళా సమయంలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో14వ నంబరు ప్లాట్‌ఫాంపై ఈ దుర్ఘటన జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa