శాడిస్ట్ భర్త చిత్రహింసలు భరించలేక నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన శ్రీవిద్య తన భర్త రాంబాబు వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంది. రాంబాబు అకృత్యాలను శ్రీవిద్య సూసైడ్ లేఖలో రాసింది. తన భర్తను వదలొద్దని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆరు నెలల క్రితం విలేజ్ సర్వేయర్ రాంబాబుతో శ్రీవిద్య వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజుల నుంచే శ్రీవిద్యను రాంబాబు శారీరకంగా హింసించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa