ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాంటి క్రీమ్స్ లేకుండానే,,,ఈ చిట్కాలతో స్కిన్‌ని మెరిసేలా చేయోచ్చు

Life style |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 10:44 PM

ఆయుర్వేదంలో అన్నీ సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. అలానే స్కిన్‌ని అందంగా మెరిపించడంలో కూడా ఆయుర్వేదం కూడా హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కొన్ని టిప్స్ పాలో అవ్వడం వల్ల కూడా స్కిన్ గ్లోయింగ్ అండ్ హెల్దీగా కనిపిస్తుంది. మనం హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వడం వల్ల కేవలం ఆరోగ్యం మెరుగ్గా మారడమే కాదు, స్కిన్ కూడా అందంగా, యవ్వనంగా మెరిపించడంలో హెల్ప్ చేస్తుంది. కేవలం రోజూ ఫాలో అయ్యే కొన్ని విషయాలే స్కిన్‌ని యవ్వనంగా అందంగా మారుస్తాయి. ఈ అలవాట్లు స్కిన్‌ని లోపలి నుంచి అందంగా మెరుస్తాయి. మరి ఆ అలవాట్లు ఏంటో తెలుసుకోండి.


ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం


ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే బాడీకి చాలా మంచిది. దీని వల్ల బాడీలోని ప్రమాదకరమైన ట్యాక్సిన్స్‌ బయటికి వెళ్లిపోతాయి. జీర్ణక్రియ కూడా మెరుగ్గా మారుతుంది. దీని వల్ల స్కిన్ కూడా మెరుస్తుంది. ఇలా నీరు తాగితే స్కిన్‌కి హైడ్రేషన్ అందుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా మారుతుంది. దీని వల్ల మొటిమలు రావు. మచ్చలు తగ్గుతాయి. చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. దీని వల్ల స్కిన్ యవ్వనంగా మారుతుంది కూడా.


పసుపు లేదా హెర్బల్ టీ


ఉదయాన్నే హెర్బల్ టీ తాగడం చాలా మంచిది. దీని వల్ల బాడీలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. హెర్బల్ టీస్‌లో పసుపు, తులసి, అల్లం టీలు చాలా బెస్ట్ ఇవి రెండు కూడా స్కిన్‌ని మెరుగ్గా చేస్తాయి. అంతేకాకుండా, లోపలి నుంచి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. స్కిన్ కూడా చక్కగా మొటిమలు, మచ్చలు లేకుండా మెరుస్తుంది. పసుపు, హెర్బల్ టీ రెండూ స్కిన్‌ని మెరిసేలా చేస్తాయి. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా మొటిమలు తగ్గించి చర్మ రంగుని మెరుస్తాయి. హెర్బల్ టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా చేసి మెరిసేలా చేస్తాయి.


ఆయిల్ మసాజ్


దీనినే ఆయుర్వేదంలో అభ్యంగ అంటారు. దీని వల్ల చర్మం మెరుగ్గా మారుతుంది. రక్తప్రవాహం పెరుగుతుంది. నాడీ వ్యవస్థ కూడా ప్రశాంతంగా మారుతుంది. ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చర్మం మెరుస్తుంది. దీనికి కారణం చర్మాన్ని లోతుగా తేమగా మార్చి రక్తప్రసరణ మెరుగ్గా మారుతుంది. దీనికోసం కొబ్బరినూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి ఆయిల్స్ వాడితే చర్మాన్ని ప్రకాశవంతంగా మారి మృదువుగా చేయడానికి, మచ్చలు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.


హెల్దీ డైట్


సహజంగా స్కిన్ మెరవడానికి తాజా, చక్కని పోషకాహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. సరైన ఆహారంతో చర్మం మెరవడం సాధ్యమే. బ్యాలెన్స్‌డ్ డైట్, నీరు పుష్కలంగా తీసుకుంటే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.


స్కిన్‌ని మెరిపించే టిప్స్


సీజన్ ప్రకారం


మీ బాడీ అండ్ స్కిన్‌ని హెల్దీగా ఉంచేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. సీజన్ ప్రకారం మంచి ఫుడ్స్ తీసుకోవాలి. సీజన్ మారగానే డైట్ కూడా చేంజ్ చేయాలి. సీజన్ డైట్ ఫాలో అవ్వడం వల్ల చర్మం మెరుస్తుంది. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే బ్యాలెన్స్‌డ్ డైట్ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుస్తుంది. అదుకే, సీజన్‌కి తగ్గట్టుగా ఫుడ్స్ తీసుకోవాలి.


వేప, మంజిష్ట వంటి మూలికలు తీసుకోవడం


మీరు వేప, మంజిష్ట వంటి మూలికలు తీసుకుంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. స్కిన్ కూడా హెల్దీగా మారుతుంది. ఈ మూలికలు చర్మాన్ని మెరిపించి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. వేపలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. మంజిష్ట కూడా రక్తప్రసరణని మెరుగ్గా చేసి స్కిన్‌ని మెరిసేలా చేస్తుంది.


కెమికల్స్ వాడకుండా


కెమికల్స్ చర్మంపై వాడడం వల్ల చర్మంలోని సహజ నూనెల్ని పోగొడతాయి. దీని వల్ల స్కిన్ బ్యాలెన్స్‌ని దెబ్బతీస్తాయి. ఖరీదైన క్రీమ్స్, కెమికల్స్ పీల్స్, సీరమ్స్ వాడడం వల్ల చర్మం మెరుస్తుందనుకుంటారు. కానీ, హార్ష్ కెమికల్స్‌ని వాడడం వల్ల ఇన్‌స్టంట్‌గా గ్లో కనిపించినప్పటికీ అది శాశ్వతంగా ఉండదు. స్కిన్ లోపలి నుంచి చక్కగా మెరవాలంటే సహజమైన పదార్థాలు వాడడం, కెమికల్స్ వాడకుండా ఉండడం మంచిది. దీని వల్ల చర్మం ఎలాంటి సమస్యలు రావు.


సహజ ఫేస్‌ప్యాక్స్


వారానికోసారి సహజ ఫేస్‌ప్యాక్స్ వాడడం మంచిది. ముల్తానీ మట్టి, రోజ్, గంధం, పసుపు వంటి పదార్థాలతో ఫేస్‌ప్యాక్స్ వేసుకోండి. వీటి వల్ల స్కిన్ హైడ్రేట్‌గా, అందంగా మారుతుంది. ఇవి మాత్రమే కాదు, శనగపిండి, తేనె, పసుపు, పెరుగు వంటి సహజ పదార్థాలు కూడా చర్మాన్ని మెరిపిస్తాయి. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తాయి. అందుకే, సహజంగా దొరికే ఫేస్‌ప్యాక్స్ వాడండి.


ప్రాణాయామం, యోగా


రక్తప్రవాహాన్ని మెరుగ్గా చేయడంలో ఈ రెండు కూడా హెల్ప్ చేస్తాయి. వీటి వల్ల చర్మానికి ఆక్సిజన్ అందిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రాణాయామం, యోగా రెండూ కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తప్రసరణని మెరుగ్గా చేసి చర్మం మెరిసేలా చేస్తుంది. రెగ్యులర్‌గా చేస్తే మీకే రిజల్ట్ కనిపిస్తుంది. స్కిన్ కూడా మెరుస్తుంది.


మంచి నిద్ర


రాత్రుళ్లు హాయిగా నిద్రపోతే స్కిన్ మెరుస్తుంది. నిద్రతో స్కిన్ షైనీగా మెరుస్తుంది. సరైన నిద్ర కణాల మరమ్మత్తు చేసి పునరుత్పత్తి అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దీని వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. హెల్దీ స్లీప్ అండ్ హ్యాబిట్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. స్కిన్ హెల్దీగా మారుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa