జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ రష్యా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మొన్న సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య భద్రతా సహకారం, వ్యూహాత్మక సంబంధాలపై ఆ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.
తాజాగా దోవల్ రష్యా ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మిలిటరీ-సాంకేతిక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఇరు దేశాల మధ్య మిలిటరీ సహకారంతో పాటు పౌర విమానాల తయారీ, రసాయన పరిశ్రమ వంటి వ్యూహాత్మక రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టుల పురోగతి కూడా ఈ భేటీలో సమీక్షకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులు రెండు దేశాల ఆర్ధిక, సాంకేతిక భాగస్వామ్యానికి కొత్త దిశను ఇవ్వనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పర్యటనతో భారత్-రష్యా సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. మిలిటరీ, పరిశ్రమ, టెక్నాలజీ రంగాల్లో సహకారం పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో పరస్పర ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దోవల్ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలమొచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa