AP: చాక్లెట్ల తయారీకి వాడే ‘కోకో’ పంట మద్దతు ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ ఆఖరు వరకు కేజీ ధర రూ.500 పలికింది. ప్రస్తుతం ఆ ధర రూ.350కి పడిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్ ధర రూ.720గా ఉంది. గతంలో ఆ ధరకు అనుగుణంగా మద్దతు ధర కల్పించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీలో 75 వేల ఎకరాల్లో కోకో పంట సాగు ఉండగా.. ఏలూరులోనే 50 శాతంపైగా పంటను పండిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa