యూపీలోని అరైయాలో దారుణం చోటు చేసుకుంది. రాఖీ కట్టిన చెల్లిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. పద్నాలుగేళ్ల బాలిక సోదరుడు అయిన సుర్జీత్ అనే వ్యక్తి ఇంటికి వచ్చి రాఖీ కట్టింది. ఆ కామాంధుడు ఆమెపై కన్నేశాడు. రాఖీ కట్టిన కొన్ని గంటల వ్యవధిలో చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపి.. శవాన్ని ఉరితాడుకు వేలాడదీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సుర్జీత్‌ను గట్టిగా విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa