అడుగులు లెక్కపెట్టుకుని నడిస్తే సరిపోదు, షుగర్ తగ్గడంతో పాటు గుండెకి మేలు జరగాలంటే ఎలా నడవాలో తెలుసా?
ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. శారీరక శ్రమకు దూరంగా ఉండటం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. అయితే, అందరూ చేయగలిగే ఈజీ వ్యాయామం వాకింగ్. ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైన వ్యాయామం. ఇక, ఈ రోజుల్లో బరువు తగ్గడంతో పాటు మిగతా వ్యాధులు రాకుండా ఉండటం కోసం చాలా మంది అడుగుల లెక్కన నడుస్తున్నారు. రోజుకు 10 వేల అడుగులు నడవడాన్ని చాలా మంది టార్గెట్ పెట్టుకున్నారు. అయితే, దీనికి మించి ఆలోచించాలని ది లాన్సెట్ అధ్యయనం చెబుతుంది. అడుగులు లెక్కసుకుని నడిస్తే సరిపోదని.. ఎలా నడుస్తున్నాం అన్నది ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అడుగులు కాదు ముఖ్యం
బిజీగా ఉన్న రోజుల్లో 10,000 అడుగుల లక్ష్యాన్ని పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చు. అది కూడా క్రమం తప్పకుండా అంటే ఇంకా చాలా కష్టం. లాన్సెట్ ఇటీవల జరిపిన అధ్యయనంలో, 7,000 అడుగుల లక్ష్యం కూడా ఆరోగ్యానికి మంచిదని తేలింది. అంటే, మీరు రోజూ 7,000 అడుగులు నడవడం ద్వారా క్యాన్సర్, గుండె జబ్బులు, డిమోషన్ వంటి వ్యాధులను నివారించవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గవచ్చు.
ఆరోగ్యానికి మంచిది
మీరు ప్రతిరోజూ నడవడం అలవాటు చేసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేయవచ్చు. ఇది మధుమేహం, రక్తపోటుస అనేక రకాల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరంగా ఉంచడానికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్. 2021 సంవత్సరంలో 'జామా' నెట్‌వర్క్ ఓపెన్ హెల్త్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం ప్రకారం, ఏడు వేల నుంచి పది వేల అడుగులు నడిచే మధ్య వయస్కులైన పెద్దల్లో మరణ ప్రమాదం 50-70 శాతం తగ్గింది.
అడుగులు కాదు వాకింగ్ టెక్నిక్ ముఖ్యం
మీరు ప్రతిరోజూ ఒకే వేగంతో నడిస్తే.. శరీరం దానికి అనుగుణంగా మారుతుంది. ఇంటర్వెల్ వాకింగ్ మీకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఇందుకోసం కొంచెం సేపు నెమ్మదిగా నడవండి. ఆ తర్వాత బ్రిస్క్ వాకింగ్ చేయండి. అంటే వేగంగా నడవండి. జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ ప్రకారం, మూడు నిమిషాల పాటు నెమ్మదిగా నడుస్తూ.. ఆ తర్వాత మూడు నిమిషాలు వేగంగా నడవడం వల్ల రక్తపోటు మెరుగుపడటంతో పాటు ఫిట్‌నెస్ స్థాయిలు మెరుగుపడ్డాయి. ఇంటర్వెల్ వాకింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. స్టామినా కూడా పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సాయపడుతుంది. అంటే బరువు తగ్గడంలో సాయం చేస్తుంది. అంతేకాకుండా కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ టెక్నిక్ కూడా ప్రభావంగా ఉంటుంది
ఒక నిమిషం వేగంగా పరిగెత్తండి. ఆ తర్వాత రెండు నిమిషాలు నెమ్మదిగా నడవండి. 20-30 నిమిషాల ఇలా రిపీట్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా నడిచి, వేగంగా రన్నింగ్ చేయడం వల్ల మీకు కొత్త ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా నడిచేటప్పుడు శ్వాస తీసుకుని వదలడం కూడా చాలా ముఖ్యం. నడకతో పాటు కొన్ని కదిలికలు చేయడం కూడా చాలా ముఖ్యం. నడిచేటప్పుడు భుజాల్ని రొటేట్ చేయడం, కాళ్లు చాపి కూర్చొని నిలబడటం లాంటివి చేయడం కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
10 వేల అడుగుల రూల్ ఎక్కడి నుంచి వచ్చింది?
10,000 అడుగులు అంటే దాదాపు 8 కిలోమీటర్లు. అయితే, దూరం వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. ఇది దశల పొడవు, నడక వేగాన్ని బట్టి మారుతుంది. వేగంగా నడిచేవారు ఎక్కువ అడుగులు వేస్తారు. 1960లో జపాన్‌లో జరిగిన మార్కెటింగ్ ప్రచారం నుంచి 10,000 అడుగులు అనే సంఖ్య ఉద్భవించింది. 1964 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు, పెడోమీటర్ ప్రారంభించారు. 'మాన్‌పో-కే', అంటే 10,000 అడుగులు. ఇది అక్కడ నుంచి వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి రోజూ పది వేల అడుగులు నడిస్తే మంచిదని నమ్ముతున్నారు. అయితే, అడుగులు లెక్కేసుకుని నడవడం కన్నా వాకింగ్ టెక్నిక్ ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రకృతిలో కాసేపు నడవండి
ప్రకృతిలో కాసేపు నడవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కేవలం ఐదు నిమిషాల పాటు ప్రకృతిలో నడిస్తే నాడీ వ్యవస్థపై పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేదా సాయంత్రం కాసేపు ప్రకృతి మధ్య నడిచి.. టెన్షన్లు దూరం చేసుకోమంటున్నారు నిపుణులు. ఇక, వాకింగ్ చేసేటప్పుడు భంగిమ చాలా ముఖ్యం. వంగి నడవడం, ఫోన్ చూస్తూ వాకింగ్ చేయడం మానుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa