ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకమైన సేవగా స్త్రీ శక్తి పథకం ను ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందనున్నారు. ఇది మహిళల ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, వారి సౌకర్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకొంటున్న కీలక అడుగు అని చెప్పవచ్చు.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 5 గంటలకు విజయవాడ బస్ స్టాండ్ లో ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించిన వెంటనే జీరో ఫెయిర్ టికెట్లు జారీ అవ్వడం ప్రారంభమవుతుంది. ఈ పథకం ప్రకారం ఏపీలో నివాసం ఉంటున్న మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్ జెండర్ వారు అర్హులుగా ఎంపికయ్యారు. అర్హతకు అవసరమైన ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.
కానీ ఈ పథకం అన్ని బస్సులపై వర్తించదు. నాన్-స్టాప్ బస్సులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే పర్యాటక బస్సులు, సూపర్ లగ్జరీ, సప్తగిరి, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. అలాగే, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల మధ్య సర్వీసులు అందించే ఇంటర్ స్టేట్ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించబడదు.
అంతేకాకుండా మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు తప్పనిసరిగా తమ ఐడి కార్డులను తీసుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం మహిళల ప్రయాణాన్ని సులభతరం చేసి, వారికి మరింత స్వాతంత్ర్యం కల్పించే దిశగా ఒక మంచి ప్రయత్నంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa