ఓడీచెరువు మండల కేంద్రంలో ఏకల్ గ్రామోథన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పొందిన 70 మంది యువతీ, యువకులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో 2023 అక్టోబర్ లో ఈ శిక్షణ తరగతులు ప్రారంభించారు. మూడేళ్ళలో 500 మందికి శిక్షణ ఇవ్వడమే ఫౌండేషన్ లక్ష్యమని, త్వరలో బ్యూటీషియన్ కోర్సులను కూడా ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. గృహాల పరిసరాల్లో వృధా నీటితో మొక్కలు పెంచేందుకు మొక్కలు కూడా పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa