రానున్న పదేళ్లలో జపాన్ భారత్‌లో రూ.5.9లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఆ దేశం మీడియా పేర్కొంది. ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో ఈ విషయాన్ని వెల్లడిస్తారని పేర్కొంది. అయితే మూడేళ్ల క్రితం అప్పటి ప్రధాని ఫ్యుమియో కిషిడా చెప్పిన 5 ట్రిలియన్ల పెట్టుబడుల ప్లాన్‌కు ఇది కొనసాగింపని తెలిపింది. సెమీ కండక్టర్స్, క్లీన్ ఎనర్జీ, ఏఐ, ఫార్మాస్యుటికల్స్ వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa