అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా తెలిపారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘భారత జెర్సీ ధరించి ఆడినందుకు గర్వపడుతున్నా. నాకు ఈ అవకాశాలు కల్పించిన బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్, జట్లు, ఫ్రాంచైజీలకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు. కాగా, భారత్ తరఫున పుజారా 103 టెస్టుల్లో 7,195 పరుగులు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa