ఏపీ అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి సమావేశాలపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని రాజకీయ, పాలనా కారణాలతో సెప్టెంబర్ 3వ వారంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa