ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానీ సంస్థకు రాష్ట్రంలో భారీ ఎత్తున భూమి కేటాయించింది. అయితే ఈ కేటాయింపులు ఇప్పుడు జరిగినవి కాదు. 9 సంవత్సరాల క్రితం అనగా 2016లోనే 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని ముందస్తు పొజిషన్ కింద కేటాయించింది. ఆరేళ్ల క్రితం అనగా 2019లోనే ఈ ప్రాజెక్టు పూర్తయి అమల్లోకి వచ్చింది. అయితే తాజాగా రెవెన్యూ శాఖ ఈ భూకేటాయింపులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు 33 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఆ భూమిని కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లీజు ఫీజు మాత్రం.. 2019 నాటి మార్కెట్ విలువ ఆధారంగానే ఉంటుందని తెలిపింది. అంటే 10 శాతం లీజు ఫీజు ఉంటుందని ఉత్తర్వుల్లో చెప్పుకొచ్చింది. అలానే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లీజు ఫీజు 10 శాతం పెరుగుతుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. సుమారు పదేళ్ల క్రితం అనగా 2016లో గవర్నమెంట్ సంస్థ అయిన ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ నుంచి.. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖకు ఒక దరఖాస్తు వచ్చింది. దాని సారాంశం ఏంటంటే.. అదానీ సోలార్ ఎనర్జీ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని ధోడియం, వడ్డిరాల గ్రామాల్లో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకుంటోందని తెలిపింది. అందుకు అవసరరమైన భూములు కేటాయించాలని కోరింది.
దీనికి నాటి ప్రభుత్వం ఆమోదం తెలిపి.. భూమి ధర, కేటాయింపు వివరాలను నిర్ణయించకుండానే.. ముందస్తు పొజిషన్‌కు అనుమతించింది. ధోడియం, వడ్డిరాలలో సుమారు 1200 ఎకరాలు, 94.36 ఎకరాల భూమిపై అదానీకి ముందస్తు పొజిషన్ ఇచ్చారు. ఆరేళ్ల క్రితం అనగా 2019 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత కూడా ఈ కంపెనీకి భూ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
కానీ తాజాగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు గతంలో చేసుకున్న భూకేటాయింపు ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. ఏపీఎల్‌ఎమ్‌ఏలో భూకేటాయింపు విధానంపై చర్చించారు. దీని ప్రకారం 33 సంవత్సరాల ప్రతిపాదికన భూమిని 33 లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. 2019 నుంచి లీజు కాలం అన్నట్లుగా, లీజు ఫీజును భూమి మార్కెట్ విలువలో 10 శాతంగా నిర్ధారించారు. ధోడియంలో ఎకరా భూమికి 3 లక్షల రూపాయలు, వడ్డిరాలలో ఎకరానికి 6.25 లక్షలుగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa