ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తనపై హైదరాబాద్‌లో దాఖలైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది. కాగా, కానిస్టేబుల్‌పై దాడి జరిగిందంటూ రఘురామ, అతని కార్యాలయ సిబ్బందిపై గతంలో ఎఫ్ఐఆర్ దాఖలు అయింది. అయితే ఆ కేసును తాను కొనసాగించదలచుకోవడం లేదంటూ సదరు కానిస్టేబుల్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసరం.. రఘురామపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa