సొంతగడ్డపై నెదర్లాండ్స్ (BAN vs NED)తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ విజయవంతంగా ఆరంభించింది. శనివారం సైల్హెట్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్.. మొదటి మ్యాచ్‌లో టాస్ కోల్పోయింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌లోకి దిగిన డచ్ జట్టు బంగ్లా బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది.డచ్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందులుఓపెనర్ మాక్స్ ఒడౌడ్ (23) కాస్త మెరుగ్గా ఆడగా.. విక్రమ్‌జిత్ సింగ్ త్వరగా పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ తేజ నిడమానూరు (26) నిలదొక్కుకున్నా, కెప్టెన్ ఎడ్‌వర్డ్స్ సహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చివర్లో ఆర్యన్ దత్ (13) కొంత రాణించాడు.బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సైఫ్ హసన్‌కు రెండు, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కి ఒక వికెట్ దక్కింది.
*లిటన్ దాస్ – సైఫ్ హసన్ జోడీ విజృంభణ:137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్ లిటన్ దాస్ (54 నాటౌట్, 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో చెలరేగాడు. అతడికి తోడుగా సైఫ్ హసన్ (36 నాటౌట్, 19 బంతుల్లో) ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరి జోడీతో బంగ్లా 13.3 ఓవర్లలోనే 138/2 స్కోరుతో గెలుపొందింది.టస్కిన్ అహ్మద్ తన నాలుగు వికెట్ల ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
*పదేళ్ల తర్వాత ప్రత్యేక రికార్డు:ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ముఖ్యంగా, పదేళ్ల తర్వాత స్వగృహంలో ఇంత పెద్ద (బంతుల పరంగా) తేడాతో టీ20లో గెలుపొందడం విశేషం. 2014లో ఢాకా వేదికగా అఫ్గనిస్తాన్‌పై 48 బంతులు మిగిలి ఉండగానే బంగ్లా గెలిచింది. తాజాగా, 39 బంతులు మిగిలి ఉండగానే విజయఢంకా మోగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa