ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు వాడే టవల్స్ తడి పీల్చుకోవడం లేదా

Life style |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 10:52 PM

టవల్స్ రోజూ వాడుతున్నారు సరే వాటిని సరిగ్గా క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, మీరు హెల్తీగా ఉండాలన్నా టవల్స్ ని సరైన విధంగా శుభ్రం చేయాలి. ఉతికే సమయంలో చాలా మంది చేసే తప్పేంటంటే..మిగతా దుస్తులతో కలిపి వీటిని వేస్తుంటారు. అలా కాకుండా ఎప్పుడైనా సరే..టవల్స్ ని ప్రత్యేకంగా ఉతకాలి. ఉతికనప్పుడు కూడా కొన్ని చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏంటి. ఎలా పాటించాలో వివరంగా తెలుసుకోండి.


బట్టలు ఎలా ఉతకాలి


టవల్స్ రోజూ వాడతారు. అయితే..కొన్నిసార్లు ఎంత క్లీన్ చేసినా నీట్ గా అవ్వవు. పైగా ముతక వాసన వస్తుంటాయి. ఇక మరి కొన్ని సార్లు అసలు టవల్ తడి పీల్చుకోదు. వాటిని సరిగ్గా ఉతకకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి. ముఖ్యంగా అసలు టవల్స్ ని ఎలా ఉతకాలో చాలా మందికి తెలియదు. సింపుల్ గా వాషింగ్ మెషీన్ లో వేసి అందులోనే ఉతికేస్తుంటారు. కొద్ది రోజులకు అవి తడిని పీల్చుకునే గుణాన్ని కోల్పోతాయి. పైగా చాలా త్వరగా పాడైపోతాయి. ఇలాంటి సమస్యలేమీ రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉతకాల్సి ఉంటుంది. అయితే..టవల్స్ ని ఎలా ఉతకాలి. ఏం చేస్తే వాటి నుంచి వాసన రాదు. అదే సమయంలో అవి తడిని పీల్చుకోడానికి ఏం చేయాలి. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.


మొదటి చిట్కా


నిజానికి మీరు ఎలాంటి డిటర్జెంట్ వాడుతున్నారనే దాన్ని బట్టి కూడా టవల్ ఎంత శుభ్రంగా ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు టవల్స్ మన్నికగా ఉండాలంటే సరైన విధంగా డిటర్డెంట్ వాడాలి. సరైన అవగాహన లేకపోతే అసలు పూర్తిగా డిటర్జెంట్ పక్కన పెట్టాలి. లేదా ఇప్పుడు చెప్పిన విధంగానే వాడాలి. యూకలిప్టస్ ఉన్న డిటర్జెంట్స్ ని వాడడం చాలా మంచిది. దీని వల్ల టవల్ సాఫ్ట్ గా మారడంతో పాటు ఎప్పుడూ తాజాదా ఉంటుంది. వీలైనంత వరకూ బ్లీచ్ అనేది వాడకపోవడమే మంచిది. అయితే..టవల్స్ ఉతికినప్పుడు మామూలుగా చల్ల నీటితో కాకుండ వేడి నీళ్లు ఉపయోగిస్తే బెటర్. కాటన్ టవల్స్ అయితే వేడి నీళ్లతోనే ఉతకాల్సి ఉంటుంది. వేడి నీళ్లతో ఉతకడం వల్ల డిటర్జెంట్ సరైన విధంగా టవల్ కి పడుతుంది. శుభ్రంగా మారుతుంది. అదే సమయంలో టవల్ చాలా త్వరగా తడిని పీల్చుకుంటుంది.


వెనిగర్


మొండి మరకలు పోగొట్టడానికి, దుర్వాసన తొలగించడానికి వెనిగర్ చాలా బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే అసిడిక్ నేచర్ చాలా త్వరా క్లీన్ చేసేస్తుంది. అయితే..టవల్స్ ఉతికినప్పుడు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్స్ వాడే బదులుగా వెనిగర్ వాడడం మంచిది. నిజానికి ఈ సాఫ్ట్ నర్స్ దుస్తులకైతే బాగానే పని చేస్తుంది. కానీ టవల్స్ కి పెద్దగా పని చేయకపోవచ్చు. పైగా వీటి వల్ల టవల్స్ కి సాఫ్ట్ నెస్ రాదు. అందుకే..వెనిగర్ వాడడం మంచిది. దీని వల్ల టవల్ సాఫ్ట్ గా మారడంతో పాటు తడిని పీల్చే గుణాన్ని సంపాదించుకుంటుంది. ఓ కప్పు వెనిగర్ ని నీళ్లలో వేసి అందులో టవల్స్ వేసి బాగా శుభ్రం చేయాలి. ఇలా ఆరు వారాలకు ఓ సారి క్లీన్ చేస్తే టవల్స్ ఎప్పుడూ నీట్ గా ఉంటాయి. పైగా త్వరగా పాడు కావు. రెగ్యులర్ గా మీరు టవల్ ని ఎలా ఉతుకుతారో అలాగే వాష్ చేసిన ఆతరవాత సబ్బు కాకుండా వెనిగర్ తో క్లీన్ చేస్తే సరిపోతుంది.


బేకింగ్ సోడా చిట్కా


బేకింగ్ సోడాతో క్లీన్ చేసినా ఎక్కువ రోజుల పాటు టవల్ మన్నికగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు క్లాథ్ పాడవకుండా చూస్తాయి. పైగా నేచురల్ స్క్రబ్బర్ లా పని చేస్తాయి. టవల్ల్ మరీ దుర్వాసన వస్తున్నప్పుడు బేకింగ్ సోడాతో ఉతికితే మంచి పరిమళం వస్తుంది. చాలా మంది టవల్ తడిగా ఉన్నప్పుడు అలాగే ఆరేస్తుంటారు. సరైన విధంగా గాలి తగలకపోతే ఆ తడి ఆరిపోదు. ఫలితంగా దుర్వాసన వస్తుంటాయి. ఈ దుర్వాసన పోగొట్టేందుకు బేకింగ్ సోడా వాడడం మంచి ఆప్షన్. డిటర్జెంట్ తో పాటు బేకింగ్ సోడా కూడా ఓ కప్పు మేర తీసుకోవాలి. వాషింగ్ మెషీన్ లో వేసేటట్టైతే ముందుగా మాములు డిటర్జెంట్ వేసి ఉతకాలి. ఆ తరవాత బయటకు తీసిన తరవాత బేకింగ్ సోడా వేసి వేడి నీళ్లతో వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల టవల్ తడి పీల్చుకోవడంతో పాటు చాలా సాఫ్ట్ గా మారిపోతుంది. పైగా దుర్వాసన కూడా తొలగిపోతుంది.


వేరుగా ఉతకాలి


చాలా మంది చేసే తప్పేంటంటే..మిగతా దుస్తులతో పాటు కలిపి టవల్స్ ఉతుకుతుంటారు. దీని వల్ల వాటికి ఉన్న మురికి పూర్తిగా వదలదు. ఫలితంగా ఉతికినా కూడా దుర్వాసన వస్తుంటాయి. పైగా మెషీన్ పై ఓవర్ లోడ్ పడినప్పుడు కూడా టవల్స్ సరైన విధంగా శుభ్రం కావు. డిటర్జెంట్ పూర్తిగా టవల్స్ కి పట్టదు. అందుకే ఈ సమస్య వస్తుంది. అలా కాకుండా వీటిని ప్రత్యేకంగా ఉతకాలి.


అవి కూడా రెండు లేదా మూడు టవల్స్ ని మాత్రమే ఓ సారి శుభ్రం చేయాలి. వాటితో పాటు హ్యాండ్ టవల్స్ వేసి ఉతికినా పరవాలేదు. కానీ ఒకేసారి ఐదారు టవల్స్ ఉతకడం వల్ల మురికి వదలకపోగా తడి కూడా సరిగ్గా పీల్చుకోలేవు. కాటన్ టవల్స్ ఉతికినప్పుడు వాటికి కాస్త గాలి తగిలితే సరిపోతుంది. అవే ఆరిపోతాయి. కానీ చాలా మంది ఎండలో వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల క్లాథ్ పాడైపోతుంది. ఎక్కువ రోజుల పాటు మన్నికగా ఉండవు.


మరి కొన్ని చిట్కాలు


తక్కువ ధరకు దొరుకుతున్నాయని ఏవి పడితే అవి కొని వాడకూడదు. సాఫ్ట్ గా, పఫ్పీగా ఉండేవి చూడాలి. కాస్తంత ధర ఎక్కువైనా వాటినే తీసుకోవాలి. ఇవే ఎక్కువ రోజుల పాటు మన్నికగా ఉంటాయి. రోజూ వాడేవి కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవడం అవసరం. లేదంటే చర్మం కూడా పాడైపోతుంది. టవల్స్ బాగా తడిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆరవేయాలి. అయితే..వాటిని ఆరవేయకుండా ఎక్కడో అక్కడో పడేస్తే వాటిపై తేమ కారణంగా బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే..సరైన చోట వాటిని ఆరవేయాలి. మూడు లేదా నాలుగు సార్లు వాడిన తరవాత టవల్స్ ని ఉతకడం బెటర్.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa