AP: విశాఖపట్నం నగరంలో వసుధ ఫార్మా సంస్థ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. స్టీల్‌ప్లాంట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రగతి మైదానంలో ఆయన మృతదేహాన్ని, పక్కనే పురుగుల మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. ఆయన పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. కాగా, ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa